బాబు చర్మం మందమెక్కింది || ysrcp news


  • బాబు చర్మం మందమెక్కింది
  • ఎన్నికలనాటి హామీలు గుర్తుకురావడం లేదు
  • ఎవరూ అధైర్యపడొద్దు
  • మన ప్రభుత్వం వచ్చాక అందరికీ రూ.15వేలు ఇస్తాం
  • వీఆర్ఏల దీక్షకు జననేత సంఘీభావం

విజయవాడః వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చి మూడేళ్లవుతున్నా ఇంతవరకు వారిని ఆదుకున్న పాపాన పోవడం లేదని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. విజయవాడలో వీఆర్ఏల ఆందోళనకు వైయస్ జగన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...చాలీచాలనీ జీతంతో బతుకు వెళ్లదీస్తున్న వీఆర్ఏల ఆర్తనాదాలు  ప్రభుత్వానికి పట్టకపోవడం బాధాకరమన్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు 10,700 ఇస్తున్నారన్న సంగతి తెలిసి కూడా బాబు వాళ్లకు న్యాయం చేయకపోవడం సమంజసమా అని ప్రశ్నించారు. 



రాష్ట్రవ్యాప్తంగా 27వేల మంది రెవెన్యూ అసిస్టెంట్ లు గ్రామసేవల కోసం పనిచేస్తున్నారని, వాళ్ల డిమాండ్ లు సహేతుకమని తెలిపారు. చాలీ చాలని జీతంతో ఎలా బతకాలని వీఆర్ఏలు ఆందోళన చెందుతుంటే...6,400 జీతం వస్తుందని చెప్పి ఉన్న వైట్ కార్డును తీసేసే కార్యక్రమం చేయడం దారుణమన్నారు. అటెండర్, డ్రైవర్ ఏ ఉద్యోగాలొచ్చినా మనకు ఇవ్వాల్సిన కోటా ఇవ్వాలని ఉన్నా...మూడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడ రిలీజ్ చేయని పాపాన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని బాబు సర్కార్ పై ధ్వజమెత్తారు.



మూడేళ్లుగా కలిసికట్టుగా పోరాడినా బాబు మన మాటలు వినడం లేదని,  ఆయన చర్మం మందమెక్కిందని వైయస్ జగన్ ఎద్దేవా చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.  మరో సంవత్సరం పోతే ఎన్నికలొస్తాయి. మూడేళ్లు ఎలాగో కష్టపడ్డాం. ఈ ఏడాది కాలంలో బాబుపై ఒత్తిడి తెద్దాం. బాబు మెడలు వంచైనా పనిచేయించుకునే ప్రయత్నం చేద్దామని వైయస్ జగన్ అన్నారు. ఒకవేళ బాబుతో పనిచేయించుకోలేక పోతే మాత్రం మన ప్రభుత్వం వచ్చాక వారం రోజుల్లోనే అందరికీ రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఒక్కరి మొహంలో చిరునవ్వులు నింపుతానని పేర్కొన్నారు.


adhikara party vallaku medhadundha prajaswamyam gurinchi telusaa ani jagan prasninchina teeru


  • అగ్రిగోల్డ్ వ్యవహారంపై 20 నిమిషాలు మైక్ అడిగితే ఇవ్వలేదు
  • 20లక్షల మందికి టోపీ పెట్టి వేలకోట్లు మింగేసిన అతిపెద్ద స్కాం
  • ఆరోపణలు వచ్చినప్పుడు వినాలన్నా ఆరాటం కూడ లేదు
  • ఎంతసేపు టాపిక్ డైవర్ట్ చేయాలన్న ఆలోచనే
  • ఆస్తులను తన్నుకుపోయిన గద్దలమీద ఎంక్వైరీ జరగాలి
  • డిపాజిట్ దారులకు న్యాయం చేయాలి
  • వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ డిమాండ్

విజయవాడః ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న తీరు కౌరవసభ కన్నా దారుణంగా ఉందని, దేశంలోనే ఇలాంటి సభ ఎక్కడా జరిగి ఉండదేమోనని వైయస్ జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణం వ్యవహారంలో సాక్ష్యాధారాలు చూపిస్తూ బాధితుల తరపున మాట్లాడేందుకు   20 నిమిషాలైనా టైమ్ ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించిందన్నారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి  సంబంధంలేని అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం అగ్రిగోల్డ్ అంశాన్ని డైవర్ట్ చేసిందని ధ్వజమెత్తారు.  20నిమిషాలకన్నా ఎక్కువగా సమయం తీసుకోకుండా ప్రజల తరపున మీ అందరికీ ఈ సాక్ష్యాధారాలు చూపిస్తున్నా. అసెంబ్లీలో నాకు స్పీకర్ మైక్ ఇవ్వని పరిస్థితుల్లో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నానని వైయస్ జగన్ అన్నారు.  విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే......



ఆస్తులను గద్దల్లా తన్నుకుపోయారు

అగ్రిగోల్డ్ వ్యవహారం నాకు, ప్రత్తిపాటికి సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు వాళ్లంతట వాళ్లే ఆధారాలు తెచ్చి అసెంబ్లీలో చెప్పండన్నా అని నన్ను కోరారు. ఈ ఆస్తులన్నీ బయటకెళ్లిపోతే మాకు డబ్బులు రావన్నా. ఈ ఆస్తులను పెద్దమనుషులు గద్దల్లా తన్నుకొని పోవడం ఆగితేనే మళ్లీ ఆస్తులు అటాచ్ మెంట్ లోకి వస్తాయి. మాకు రావాల్సిన సొమ్ము కాస్తో కూస్తో వస్తుంది . లేకపోతే రాదని వాళ్లు సేకరించిన ఆధారాలు నాకు ఇచ్చారు. జరిగిన తీరంతా చూశాం. అగ్రిగోల్డ్ టాపిక్ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఎలా మైక్ కట్ చేశారో,  టాపిక్ ఎలా పక్కకువెళ్లిపోయిందో చూశాం.  స్పీకర్ గతంలో ఓ ప్రెస్ మీట్ లో ఆడవాళ్లను కార్ షెడ్ లకు లింక్ చూస్తూ అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలను తీసుకొచ్చి డైవర్ట్ చేశారు. ఇవాళ కూడ అదే తీరు. ప్రతిపక్ష నాయకుడిగా అగ్రిగోల్డ్ వ్యవహారంపై మాట్లాడేందుకు 20 నిమిషాలు టైం ఇవ్వండి, అనంతరం మీరు మాట్లాడండి, ఆతర్వాత ప్రజలే డిసైడ్ చేస్తారు అని అడిగితే మైక్ ఇవ్వలేదు. గద్దల్లాగ ప్రభుత్వ నేతలే ఆస్తులు తినే కార్యక్రమం చేస్తున్నారని బాధితులు తమకు తాముగా ఆధారాలతో నా దగ్గరకు వచ్చారు.  20 లక్షలమందికి టోపీ పెట్టి వేలకోట్లను మింగేసిన అతిపెద్ద స్కాం అగ్రిగోల్డ్. ఈ స్కాంలో మంత్రి పుల్లారావు అనే వ్యక్తి చిన్నచీమలాంటి వారు. ఇతని మాదిరిగానే ఇంకా చాలామంది పెద్దమనుషులు పేర్లు బయటకు రావాలి. వీళ్ల చేతుల్లోంచి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడి అటాచ్ మెంట్ లోకి తెచ్చి డిపాజిట్ దారులకు మేలు జరిగేలా అమ్మి వాటిని పంచాలి. ప్రతిపక్ష నాయకుడిగా నేను చేస్తున్న పని మాట్లాడలేని వారి స్వరాన్ని వినిపించాలనుకున్నాను. దానికి వాళ్లు మాట్లాడుతూ పుల్లారావు అయినా లేకపోతే నేనైనా సభలో ఉండాలంట. ఆరోపణలు రుజువైతే ఆయన, నిరూపించకపోతే నేను వైదొలగాలని, ఎవరో ఒకరే ఉండాలని తీర్మానం చేయడం చూస్తే ఆశ్చర్యమేసింది. వీళ్లకు మెదడు ఉండి చేస్తున్నారా లేక చేస్తున్నారా అనిపించింది. దీనివల్ల అగ్రిగోల్డ్ బాధితుల కడుపులు నిండుతాయా...?వాళ్లకు మంచి జరుగుతుందా..? ఆరోపణలు వచ్చినప్పుడు వినాలన్నా ఆరాటం కూడ లేదు. ఎంతసేపు టాపిక్ డైవర్ట్ చేయాలన్న ఆలోచనే. స్పెక్ట్రమ్, బోఫోర్స్, కోల్డ్ స్కాం ఇవన్నీ ఎంక్వైరీలకు ఎలా పోయాయి. ప్రతిపక్షంలోని వాళ్లు ఆధారాలతో  పార్లమెంట్ లో మాట్లాడితే అదికార, ప్రతిపక్షాల మధ్య చర్చ జరిగి ఎంక్వైరీకి వేసినప్పుడు ఈ స్కాంలు బయటకొచ్చాయి.



ప్రతిపక్షం ఏం చేయాలన్న పాత్ర వీళ్లకు తెలుసా

అన్ని ఆదారులున్నాయని బాధితులు వారిచ్చినవి చూపించడానికి 20 నిమిషాలు కావాలంటే మైక్ కట్ చేయడం, చాలెంజ్ అనే పేరు తెచ్చి టాపిక్ డైవర్ట్ చేయడం దారుణం. బాబుకు చాలెంజ్ మీద నమ్మకముందే ఇదే సభలో చాలెంజ్ అని నేను ఎన్నోసార్లు అన్నా. ఏనాడైనా పలికాడా. మా 21మంది శాసనసభ్యులను ప్రలోభాలు, డబ్బులిచ్చి తీసుకున్నావ్. ప్రజలు నీ పార్టీకి ఓట్లేయలేదు. వాళ్లు మా పార్టీ గుర్తుపై గెలిచారు.  సంవత్సరం నుంచి వాళ్లను డిస్ క్వాలిఫ్ చేయకుండా బాబు, స్పీకర్ కాపాడుతున్నాడు. సిగ్గులేకుండా వాళ్లంతా అధికారపక్షం బెంచుల్లో కూర్చున్నారు. స్పీకర్ ఎదురుగా సీట్లో కూర్చోబెట్టారు. బాబు నీకు ప్రజలకు మంచి చేశానన్న నమ్మకముంటే ప్రజల దగ్గరకుపోదాం. ప్రజలు ఇచ్చే దాన్ని రెఫరెండంగా తీసుకుందా. మాకు మెజారిటీ వస్తే నీవు పదవినుంచి తప్పుకో అని సవాల్ విసిరితే తీసుకోలేదు. ఎందుకంటే అది నచ్చదు.  కోట్లాది రూపాయలు ఇచ్చి తెలంగాణలో ఆడియో, వీడియోల్లో దొరికిన ఏకైక ముఖ్యమత్రి బాబు. అలా సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికాక సుప్రీంకోర్టులో కేసు విని న్యాయమూర్తులు నోటీసులు ఇచ్చారు. ఆ గొంతు బాబుది కాదని నిరూపించగలడా అని చాలెంజ్ విసిరాం. దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఆయనకు నచ్చదు. ఆయన చాలెంజ్ తీసుకోడు.  టాపిక్ డైవర్ట్ చేసేందుకు అవతలోళ్లు రెచ్చిపోయి చాలెంజ్ తీసుకోవాలట. లేకపోతే తప్పుచేసినట్లట. వీళ్లకి అసలు ప్రజాస్వామ్యం తెలుసా. ప్రతిపక్షం ఏం చేయాలన్న పాత్ర వీళ్లకు తెలుసా. ప్రతిపక్షాన్ని మాట్లాడనీయాలి. ప్రతిపక్షం దగ్గర ఏవైనా సాక్ష్యాధారాలు వచ్చినప్పుడు తెలుసుకోవాలన్న తపన ఉండాలి. ఆ సాక్ష్యాధారాలు విని పస ఉంటే ఎంక్రైరీకి ఆదేశించాలి. అప్పుడు డెమోక్రసీ అనిపించుకుంటుంది.



బాబు కొడుకు, ఎంపీల హస్తముంది

కర్మ ఏంటంటే పుల్లారావు దగ్గర్నుంచి హాయ్ లాండ్ ఆస్చులు ఎందుకు ఆంక్షన్ వేయడం లేదో ఎవరికి తెలవడం లేదు. ఏరాడలో 116 ఎకరాల రిసార్ట్స్ ప్రైం ప్రాపర్టీ ఆక్షన్ ఎందుకు వేయడం లేదో ఎవడికి తెలవడం లేదు. అతిహోయ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ ఆక్షన్ ఎందుకు రావడం లేదో చెప్పరు. వాల్యూవున్న వీటి మీద ఆక్షన్ వేయడం లేదు. వీటిలో ఎంపీల హస్తముంది, బాబు కొడుకు హస్తముందని ఆరోపణలున్నాయి. ఎందుకు ఆక్షన్ కు రావడం లేదు. సంవత్సరన్నర అయిపోయింది. బాధితులకు వచ్చింది 16కోట్లు మాత్రమే. వాళ్ల బాధ ఎవరు తీరుస్తారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువలు 19లక్షల 50వేలమందికి సంబంధించి రూ. 3900కోట్లు. కేవలం రూ. 1182కోట్లు ఇస్తే 13లక్షల 83వేలమందికి న్యాయం జరుగుతుందని చెప్పారు. డిపాజిట్ దారులొచ్చి అన్నా మన బడ్జెట్ లక్షా 50వేల కోట్లు . చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యేలా మనసు కరిగేలా గట్టిగా వినిపించడన్నా అని కోరారు. రూ.14లక్షల కుటుంబాలు బాగుపడుతాయని వారు అడిగిన మేరకు జాగృతి చేస్తే ఆయనకు ఎక్కదు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇచ్చే తీర్మానాలు ఇవ్వడు. దాని గురించి మాట్లాడేవారిని ఎలా కట్టడి చేయాలనే దానిపై మాత్రమే తీర్మానాలు చేస్తారు. ఇప్పటివరకు ఈ స్కాంకు సంబంధించి ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారు. చైర్మన్ ఆయన తమ్ముడు. దాదాపు 8మంది అన్నదమ్ములు, బంధువులు అగ్రిగోల్డ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా వున్నారు . వీళ్లు ప్రజల దగ్గరున్న డబ్బులను మిస్ అప్రాప్రియేట్ చేసి ఆడబ్బులతో బయట ప్రాపర్టీస్ కొని ఆస్తులు అమ్ముకుంటున్నారని అసెంబ్లీ దృష్టికి తెచ్చాం. ప్రత్తిపాటి ఒక్కడే కాదు తిరుపతిలో వెంకటాద్రి హోటల్ ఆ డబ్బులతో ఎకరం చిల్లర  14కోట్లు అమ్మేశారు. ఇదొక్కటే కాకుండా బ్రహ్మంగారి మఠంలో సీతారాం అనే డైరెక్టరు ఆయన భార్య, కూతురు బంధువులు భూములు 2016లో కూడా అమ్మారని ఆధారాలతో సహా చూపించాం. వాళ్లు రాజకీయాలకు సంబంధం లేదు వాళ్లు. ప్రత్తిపాటి ఒక్కడే కాదు అందరి గురించి చెప్పాం. ఇవి వినాలన్న ఆరాటం లేదు.  హాయ్ లాండ్ , ఏరాడలో, అతిహోయలో ఆక్షన్ ప్రాపర్టీస్ పై నిలదీస్తామని భయపడుతున్నారు.



డిపాజిట్ దారులకు న్యాయం చేయాలి

మంత్రి పుల్లారావు భార్యకు భూములు అమ్మిన వ్యక్తి ఉదయ్ దినకరన్. ఈ వ్యక్తి అగ్రిగోల్డ్ సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నాడు. హాయ్ ల్యాండ్ ప్రాపర్టీలో డైరెక్టర్ గా ఉండి దాన్ని ఆపరేట్ చేస్తున్న కంపెనీ ఆర్కా లీజర్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్. ఈ కంపెనీలో 2010 మార్చి 8నుంచి  డైరెక్టర్ గా ఉన్నాడు. ఈ పెద్దమనిషి ఆ ఒక్క కంపెనీయే కాదు అగ్రిగోల్డ్ కు చెందిన రామా వాస్ అనే కంపెనీలో కూడ కొనసాగుతున్నాడు. అగ్రిగోల్డ్ ప్రజలకు టోపి పెడుతుందన్న ఆరోపణల మధ్య 31-7-2014లో ఈయన భూములు కొనుగోలు చేశాడు. ఈ భూములే ఆతర్వాత ప్రత్తిపాటికి తక్కువ ధరకు అమ్మాడు .  ఈయన భూములు కొనుగోలు చేసినట్లు సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఎప్పుడు కొన్నడు రిజిస్ట్రేషన్ చేసింది.  ఈయనకు అమ్మినాయన వెంకట ప్రసాద్ .కొన్నది దినకరన్. తర్వాత అగ్రిగోల్డ్ మీద కేసులు పడ్డాయి. 24-12-2014లో ఓ కేసు, 2-1-15లో ఇంకో కేసు నమోదైంది. ఆతర్వాత 4వ తేదీన అన్ని పేపర్లలో వచ్చింది.  వెస్ట్ గోదావరికి సంబంధించిన పోలీసులు అగ్రిగోల్డ్ చైర్మన్ ఇంటిమీద, హాయ్ ల్యాండ్ ప్రాపర్టీస్ మీద రైడ్ చేశారు. ఇది అన్ని పేపర్లలో వచ్చింది.  19వ తేదీ ఇదే హాయ్ లాండ్ లో ఉన్న దినకరన్ ప్రత్తిపాటి భార్య వెంకాయమ్మ పేరున తక్కువ రేటుకి భూములు అమ్మాడు.  లంచమిస్తున్నట్టుగా, తీసుకుంటున్నట్టుగా భూములు అమ్మాడు. కోల్డ్ స్కాంలో, బోఫోర్స్, స్పెక్ట్ర్ మ్ స్కాం లో ప్రతిపక్షం ఏమాట్లాడిందో తెలియదు గానీ వాటిపై సీబీఐ ఎంక్వైరీలు మాత్రం వేశారు. ఆధారాలు చూపిస్తున్నాం. సీఐడీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండే సంస్థ. అది కాకుండా హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సీబీఐ ఎంక్వైరీ జరగాలి. అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు నష్టం జరగకూడదు. ఆస్తులు అమ్మడం సజావుగా జరగాలి. డిపాజిట్ దారులు నష్టపోవద్దు. వాళ్లు ఇప్పటికే ఎక్కువగా నష్టపోయారు. ఈ గద్దల మీద ఎంక్వైరీ చేసి తీసుకున్న ఆస్తులు మళ్లీ వెనక్కితెచ్చి రీ ఎటాచ్ చేసి వేలం వేసి వచ్చిన డబ్బులను డిపాజిట్ దారులకు అందజేయాలి. వాళ్ల తరపున వాళ్ల స్వరంగా నేను మాట్లాడాలనుకున్నది ఆధారంగా చూపించాలని. రెండు రోజులు దీనిపై మాట్లాడనీయకుండా అధికార పార్టీ టైమ్ వేస్ట్ చేసిందని వైయస్ జగన్ అన్నారు.



రుణమాఫీ అంతా బోగస్సే..

చంద్రబాబు చెబుతున్న రుణమాఫీ అంతా కూడా బోగస్సే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. బాబు సీఎం  అయ్యే నాటికి రాష్ట్రంలో రూ.88,612 కోట్లు రైతు రుణాలు ఉన్నాయి. వీటన్నిటిని మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. బాబు మాటలు విని రుణాలు కట్టకపోవడంతో రైతులు సంవత్సరానికి ఏటా 16 వేల కోట్లు కడుతున్నారు. వీరేమో ఏడాదికి రూ.3 వేల కోట్లు ఇస్తే ఏమాత్రం సరిపోతాయి. కోటి 10 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఒకవైపు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. మరో వైపు రైతుల రుణభారం విఫరీతంగా పెరిగిపోతోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రుణమాఫీపై అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్పారు. మా పార్టీకి చెందిన ధర్మశ్రీ గురించి మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. ధర్మశ్రీకి రూ.1.34 లక్షల రుణలు మాఫీ అయ్యాయని చెప్పారు. ధర్మశ్రీ వాస్తవ పరిస్థితి చెబుతున్నారు. ఆధార్‌కార్డుతో సహాభార్య పిల్లలతో ఆధారాలు చూపారు. మంత్రి పుల్లారావు చెప్పిన మాటలు అసెంబ్లీ రికార్డులో నుంచి తెచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి..ధర్మశ్రీ భార్య విజయలక్ష్మి.. ఆమె 2007లో బ్యాంకులో 49 సెంట్ల భూమి తీసుకొని రూ.35 వేలు తీసుకుంది. వడ్డీతో కలిసి రూ.70300 అయ్యిందని, వీటిని రుణమాఫీ అందింది రూ.5793 , రెండో అంశం..నాలుగు ఎకరాలు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.27 వేలు తీసుకుంది. ధర్మశ్రీ పేరుతో బ్యాంకు లోన్‌ రూ.50 వేలు తీసుకున్నారని మంత్రి చెప్పారు. భూమి ఎంతో  చెప్పలేదు. దీనికి ఎలాంటి వడ్డీ లేదు కాబట్టి మొత్తం లోన్‌ మాఫీ అయ్యిందని చెప్పారు. రెండో కేసు..ప్రైమరీ సొసైటీ నుంచి తీసుకున్న మొత్తం రుణమాఫీ అయ్యిందని చెప్పారు. బ్యాంకు నుంచి వచ్చిన రిపోర్టు ఏంటంటే మొదటి ధపా రుణమాఫీ రూ.10 వేలు ఇచ్చారు. అసలు రూ.3900, మిగిలిన రూ.6100 వడ్డీకి సరిపోయింది. రెండో ఫేస్‌ రుణమాఫీ కింద రూ.11 వేలు ఇచ్చారు. ఇవాల్టీకి రుణం ఎంత ఉందంటే..రూ.51 వేలు ఉంది. మంత్రి మాత్రం మొత్తం మాఫీ అన్నారు. ధర్మాశ్రీ మూడో కేసు ఇలా ఉంది. ఇది ధర్మశ్రీ భార్య విజయలక్ష్మి పేరుతో కెనరా బ్యాంకులో అగ్రికల్చరల్‌ గోల్డు లోన్‌ రూ.3 లక్షలు తీసుకున్నారు. దీనికి మంత్రి ఎంతిచారంటే..రూ.14 వేలు రుణమాఫీ కింద ఇచ్చారు. ధర్మశ్రీ వడ్డీలు కట్టుకుంటు వస్తున్నా ఇవాల్టికి రూ.3 లక్షలు ఉన్నాయి. ఈ మూడు బ్యాంకులు కలిపితే రూ.4.23 లక్షలు ఉన్నాయి. వీళ్లు ఇచ్చింది రూ.41421 మాత్రమే ఇచ్చారు. అసెంబ్లీలో రూ. 1.36 లక్షలు ఇచ్చామని చెప్పారు. ఇంత గొప్పగా రుణమాఫీ కార్యక్రమం చేస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు చెప్పుకుంటూ పోతున్నారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. మైక్‌ కట్‌ చేస్తున్నారు. ఇవాల్టికి కూడా రెండు గంటల సేపు టైం తీసుకొని సభలో వైయస్‌ జగన్‌ అట్టా..వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇట్టా అని అవే ఆరోపణలు చేస్తున్నారు. సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు. అంతా కూడా దేవుడు చూస్తున్నాడు.

sampradayaniki viruddamga sabha nu nadipistunna speaker



  • సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయమన్నామంటే చాలెంజ్‌ ఒప్పుకున్నట్లా.. కాదా..?
  • ప్రజా సమస్యలపై చర్చించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు
  • వైయస్‌ జగన్‌ మూడు చాలెంజ్‌లను కూడా సభ నుంచి కొనసాగించాలి
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
వెలగపూడి: సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా స్పీకర్‌ అసెంబ్లీని నడిపిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తొడ కొడితేనే మైక్‌ ఇస్తా అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు వేలంపాట బిజినెస్‌లాగా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కరువుపై చర్చకు స్పీకర్‌ అనుమతిచ్చినట్లే ఇచ్చి...  చర్చను తప్పుదోవ పట్టించమని  వారి సభ్యులకు ఇండికేషన్స్‌ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్డీతో విచారణకు ఒప్పుకున్నామంటే చాలెంజ్‌కు ఒప్పుకున్నట్లా కాదా అని టీడీపీని ప్రశ్నించారు. జ్యుడీషియల్‌ ఎంక్వైరీకి ఒప్పుకున్న తరువాత ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయని, గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మా సవాళ్ల నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారు?
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పార్టీకి సవాళ్లు విసిరితే వాటిని స్వీకరించకుండా తప్పించుకు తిరుగుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో వైయస్‌ జగన్‌ మూడు చాలెంజ్‌లు చేశారని గుర్తు చేశారు. ఓటుకు కోట్ల కేసులోని వాయిస్‌ మీదా.. కాదా.? అని చాలెంజ్‌ విసిరితే అధికార పక్షం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రతీసారి లక్షల కోట్లు సీబీఐ స్వాధీనం చేసుకుందని ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆస్తుల్లో 10 శాతం ఇచ్చి మిగిలింది మీరు తీసుకోండి అని చాలెంజ్‌ విసిరితే దాని నుంచి తప్పించుకున్నారన్నారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకు తలొగ్గి టీడీపీలో చేరిన 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు పోదామని చాలెంజ్‌ విసిరితే దాని నుంచి కూడా చంద్రబాబు పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ విసిరిన మూడు చాలెంజ్‌లకు ఎందుకు ముందుకు రాలేకపోయారని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే స్పీకర్‌ వీటిని కూడా హౌస్‌ నుంచి కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

CHANDRABABU NAIDU రెండేళ్ళ పాలన ఎలా వుందో తెలిస్తే షాక్ అవుతారు



ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది.తన పాలన ఎలా సాగిందన్నది విశ్లేషించుకోవడం నిజానికి మన కన్నా చంద్రబాబుకే ఎక్కువ అవసరం. కాని చంద్రబాబు కాని, ఆయన పార్టీ నేతలు కాని, మంత్రులు కాని విశ్లేషణల కన్నా , ఆత్మ విమర్శల కన్నా రెండు కోణాలలో జనాన్ని నమ్మించాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది.ప్రభుత్వంలోకి రావడానికి ఎన్నో వందల హామీలు ఇచ్చి ఉండవచ్చు.వచ్చిన తర్వాత వాటిలో కొన్నిటిని అమలు చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు. ఆ క్రమంలో కొన్ని ఇబ్బందులు సహజంగానే వస్తాయి.వాటిని కూడా అర్దం చేసుకోవచ్చు. కాని వాటిని ప్రజలకు నిజాయితీగా వివరించి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసి ఉంటే చంద్రబాబు ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఒక అబద్దాన్ని నమ్మించడానికి వంద అబద్దాలు ఆడతారని నానుడి.దీనిని వంటబంటించుకున్నట్లుగా ప్రభుత్వ నేతలు వ్యవహరించడం వల్ల ఎక్కువ నష్టపోతున్నారు. హామీలు అమలు చేస్తారా?లేదా అన్నది ఒక అంశం అయితే మౌలికంగా ప్రభుత్వంలో ఉన్నవారికి ఉండవలసిన కనీస నిజాయితీ లోపించడం అతి పెద్ద సమస్య గా ఉంది.ఇదేదో నన్ను వృత్తిపరంగా ఇబ్బంది పెట్టారనో,మరొకటనో ద్వేషంతో రాయడం లేదు. కేవలం సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లవలసిన వారు ఇలా వ్యవహరించడం ప్రజలకు ఎంతో నష్టమన్న ఆవేదనతోనే చెబుతున్నాను. రెండు ప్రధాన విషయాలు చంద్రబాబు కాని, ఆయన మంత్రివర్గ సహచరులు కాని చెబుతుంటారు. ఒకటి రాష్ట్రం చాలా కష్టాలో ఉంది.రెండు రాష్ట్రం ఈ రెండేళ్లలో చాలా అభివృద్ది చెందింది.పది శాతమో, పదిహేను శాతమో వృద్ది రేటు సాదించేశాము అని అంటారు. ఇక్కడే వైరుద్యం ఉంది. రాష్ట్రం కష్టాలలో ఉంటే ఇంత అబివృద్ది ఎలా సాదించారన్న సందేహం ఎవరికైనా వస్తుంది. కాని సందేహాలు పెట్టుకోవద్దని, తాము చెప్పింది విని ఊరుకోవాలని ఏలికల కోరిక. చంద్రబాబు కూడా ఇదే మాట అంటుంటారు. అవసరమైతే మరో రెండు గంటలు ఎక్కువ కష్టపడతా.నిజమే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు రెండు గంటలు ఎక్కువ కష్టపడితే మొత్తం సమస్యలన్నీ తీరిపోతే , డబ్బులు సమకూరితే అంతా సంతోషించవలసిందే. కాని అలా ఎలా జరుగుతుందన్నది అర్దం కాదు.రెవెన్యూ లోటు పదహారు వేల కోట్లు ఉంది. అయినా చంద్రబాబు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెబుతుంటారు. చంద్రబాబు అయినా మరొకరు అయినా వివిధ స్కీములు అమలు చేసేది ప్రభుత్వ డబ్బుతోనే తప్ప సొంత డబ్బులతో కాదు కదా.మరి అయితే అంత రెవెన్యూ లోటు ఉంటే ఇంత డబ్బు ఎలా పుట్టుకు వస్తుందన్న సంశయం ఎవరికి రాకూడదన్నది వారి ఉద్దేశం కావచ్చు.రుణమాఫీ 24 వేల కోట్లు చేసేశాం,చరిత్రలోనే ఎవరూ చేయలేదని వారు చెబుతుంటారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే ఆయన చెప్పినట్లు 24 వేల కోట్ల రూపాయలు కాకపోయినా పది వేల కోట్లు అనుకున్నా,అది ఎక్కడ నుంచైన సృష్టించారా అని ఎవరూ అడగకూడదు.ఈ రుణ మాఫీ మంచి,చెడు పక్కన బెడితే, అది సరిగా అమలు జరగక వడ్డీలు కట్టలేక, రుణాలు పెరిగి రైతులు సతమతం అవుతున్నారని విపక్ష నేత జగన్ సమక్షంలో కొందరు రైతులు వాపోయారు. డ్వాక్రా మహిళలను ఆదుకున్నామని ఆయన చెబుతుంటారు. డ్వాక్రా మహిళ రుణాలు మొత్తం రద్దు చేస్తామని చెప్పారా?లేక ఇలా పదివేల చొప్పున ఇస్తామని టిడిపి మానిఫెస్టోలో పెట్టారా అన్నది వారు ఎన్నడైనా విశ్లేషించుకున్నారా?ముద్దు కృష్ణమనాయుడు వంటివారు డెబ్బైఐదు శాతం హామీలు అమలు చేసేశామని ఒక అడుగు ముందుకేసి చెప్పవచ్చు. తప్పు లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ హామీలు అమలు చేయకపోయినా, ఫలానా ఇబ్బంది వల్ల చేయలేకపోయాం. ఈ తప్పు జరిగింది. ఇంతవరకు చేశాం అని చెప్పి సర్దుకుంటే ప్రజలు కూడా అర్ధం చేసుకునేవారు.ఉదాహరణకు 1996లో లోక్ సభ ఎన్నికలకు ముందు చంద్రబాబు కిలో రెండు రూపాయల బియ్యం పధకం కొనసాగిస్తామని, మద్య నిషేదం, తదితర అంశాలలో అనేక ప్రచారాలు చేశారు. ఎన్నికలు అయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక కార్యక్రమం పెట్టి మద్య నిషేధం ఎత్తివేయడం, బియ్యం దర రెండు రూపాయల నుంచి ఐదు రూపాయలకు పెంచడం తదితర నిర్ణయాలు చేశారు. అప్పుడు రాజకీయంగా కొంత విమర్శ వచ్చినా విశ్లేషిస్తే ఆయన చేసిన దానిలో పెద్ద తప్పు లేదన్న అబిప్రాయం కలిగించగలిగారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబందించి వాస్తవాలు చెప్పడానికి యత్నించారన్న భావన కలిగింది. కాని ఇప్పుడు అలా చేయలేకపోతున్నారు.ఏదో కంగారు..ఏదో అనుమానం.. వాటిని గమనిస్తే గిల్టీ కాన్సస్ తో చంద్రబాబు ఉన్నారా అన్న భావన వస్తుంది.దానిని సానుకూలంగా మార్చుకోకుండా మరిన్ని తప్పులు చేస్తున్నారన్న సందేహం వస్తుంది.ఒక మాట చెప్పవచ్చు. ప్రస్తుతం చేస్తున్న పాలన కన్నా 1996-2004 మధ్యే ఆయన కొంత బెటర్ గా ఉన్నారా అనిపిస్తుంది.అన్ని పరస్పర విరుద్దమైన ప్రకటనలే. మనవద్ద డబ్బులు లేవు..అయినా ప్రపంచ స్థాయి రాజధాని కడతా.. , మనం కష్టాలలో ఉన్నాం..అందరూ త్యాగాలు చేయాలి...ప్రత్యేక విమానాలలో తిరిగితే తప్పేమిటి? అంతేకాదు.టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో చంద్రబాబు క్యాంప్ ఆఫీస్ లకు అయిన ఖర్చు ఎనభై కోట్లు అని ఒక వార్త వచ్చింది.దానిని ప్రభుత్వం ఖండించినట్లు కనిపించలేదు.ప్రజలను త్యాగాలు చేయాలంటున్న ముఖ్యమంత్రి ఇలా ఖర్చు చేయవచ్చా అంటే ఏమి చెబుతాం .ఇక ప్రత్యేక హోదా కోసం పోరాడతాం..కాని అది వస్తే మాత్రం ఏమి అవుతుంది?అని ఆయనే అంటారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నపపుడు సంతోషం కలుగుతుంది.కాని అవి సరిగా జరగడం లేదన్న వార్తలు వచ్చినప్పుడు బాద కలుగుతుంది. కాపులకు సంబందించి కూడా అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు సమస్యలో పడ్డారు. ముద్రగడ పద్మనాభం నేరుగా ముఖ్యమంత్రి అబద్దాలు ఆడుతున్నారని చెబుతున్నారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. తుని రైలు విద్వంసం ఘటన ప్రభుత్వ వైఫల్యానికి ఒక నిదర్శనం. ఒక రైలు మొత్తం క్షణాలలో తగలబడదు. అంత గొడవ జరుగుతుంటే పోలీసు యంత్రాంగం ఎందుకు చూస్తూ ఊరుకుందో చెప్పకపోగా, ఘటన పూర్తి అయి,అవకముందే విపక్ష నేత జగన్ పై ముఖ్యమంత్రే ఆరోపణ చేసే స్థితికి వచ్చారంటే ప్రభుత్వం బాగా పనిచేస్తోందని అనుకోగలుగుతామా? రాజకీయాలు ఏమైనా శాంతి భద్రతల విషయంలో కూడా చంద్రబాబు రాజకీయం చేయడానికి వెనుకాడకపోవడం దురదృష్టకరం. దీక్ష సమయంలో తుని ఘటన కేసులు ఉండవని హామీ ఇచ్చారని ముద్రగడ అంటున్నారు.అది నిజమే అయితే ప్రభుత్వం పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది.పైగా ముద్రగడ ఒక మాట గుర్తు చేస్తున్నారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు చంద్రబాబు టిడిపి కార్యకర్తలతో విద్వంసం సృష్టించారని ఆయన ఆరోపించారు.దానికి టిడిపి నేతలు జవాబు చెబుతారా?చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో అసలు ఏవీ మంచివి కావని ఎవరూ చెప్పజాలరు. రాజధానికి అన్ని వేల ఎకరాల భూమి అవసరమా?కాదా అన్నది ఒక చర్చ అయినా, వారికి ఇచ్చిన ప్యాకేజీ బాగానే ఉందని అనుకోవచ్చు.అలాగే ఇసుక ఫ్రీ గా ఇవ్వడం కూడా మంచిదే.పెన్షన్లు, రేషన్ , పాస్ పుస్తకాలు ఇవ్వడానికి కొన్ని సంస్కరణలు తీసుకువచ్చామని చెబుతున్నారు.అంతవరకు ఎవరూ కాదనరు. ఓటుకు నోటు కేసు దెబ్బతో విజయవాడకు తరలిన ముఖ్యమంత్రి రాజధానిలో భవన నిర్మాణం పూర్తి కాకుండానే ఉద్యోగులను ఎందుకు అవస్థల పాలు చేస్తున్నారో అర్దం కాదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ఉపన్యాసాలు చెప్పిన పెద్దలు, సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని గతంలో ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు, సరిగ్గా అవే ఆరోఫణలకు గురి అవుతున్నారు.ఎలాంటి భేషజం లేకుండా ,అప్రతిష్ట అన్న ఫీలింగ్ కూడా లేకుండా వేరే పార్టీ ఎమ్మెల్యే కి కండువా కప్పి సంతోషపడుతున్నారు.రాష్ట్ర విభజనను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించినట్లు , విభజన అన్యాయం అంటూ చంద్రబాబు నవనిర్మాణదీక్షలోకాని,ఇతరత్రా చెప్పుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగా తీర్మానం చేయడమే కాదు..ఒకటికి రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చి కూడా ధైర్యంగా ప్రజలను నమ్మించగలగడం బహుశా చంద్రబాబు వల్లే అయిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.తెలంగాణ వచ్చిందని అవతరణ దినోత్సవం ఒకరోజుతో తెలంగాణ ప్రభుత్వం సరిపెట్టుకుంటే, చంద్రబాబు మాత్రం వారం రోజుల పాటు కోట్లు ఖర్చు పెడుతూ సంకల్పం అంటూ చెప్పిన విషయాలనే చెబుతూ ఎనిమిది రోజులు గడిపడం కూడా విశేషమే అని చెప్పాలి.ఇవన్ని విమర్శలు అనుకుంటే మనం ఏమి చేయలేం.ముందుగా వీటిపై ఆత్మ విమర్శ చేసుకోవలసింది చంద్రబాబు ,ఆ తర్వాత కూడా చంద్రబాబే.ఎందుకంటే చంద్రబాబు కు తప్పు చేస్తున్నారని చెప్పగల ధైర్యవంతుడు తెలుగుదేశంలో లేరు.అదే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేసే ప్రమాదం ఉంది.ఇంకా మూడేళ్ల గడువు ఉంది. ఇప్పుడైనా చంద్రబాబు మారితే ఆయనకే మేలు.

చంద్రబాబు పచ్చి అభాద్దల కోరు అని ఈరోజు మల్లి నిరూపించుకున్నాడు



వెలగపూడి: అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై అబద్ధాలు చెబుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఉందని అసెంబ్లీలో తీర్మాణించడం ఐదు కోట్ల ఆంధ్రప్రజలను మోసగించినట్లేనని మండిపడ్డారు. తిరుపతి ఎన్నికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీని పక్కనబెట్టుకొని 15 సంవత్సరాలు కావాలని మాట్లాడింది గుర్తుకు లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. 14వ ఆర్థిక సంఘం అభ్యంతరాలు చెప్పిందనడం దారుణమన్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులు లిఖిత పూర్వకంగా హోదాకు మేము అడ్డుకాదని చెబుతున్నారని పేర్కొన్నారు. పోలవరం బహుళార్ధక ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్‌ నట్టేట ముంచుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ పోలవరం, ప్రత్యేక హోదాలపై వాస్తవాలు చెబుతుంటే అది జీర్ణించుకోలేని అధికార పక్షం ఆయనపై విమర్శలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి ఉన్న ప్రోటోకాల్‌ను కూడా అధికార పార్టీ నేతలు తుంగలో తొక్కుతున్నారని ఫైరయ్యారు. రాష్ట్ర సమస్యలపై వాస్తవాలు మాట్లాడుతున్న వైయస్‌ జగన్‌ మైక్‌ కట్‌ చేయడం అప్రజాస్వామికం అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టిన చంద్రబాబు ప్యాకేజీ గొప్పదంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రత్యేక హోదా పోరు ఆగదని స్పష్టం చేశారు. హోదా సాధనే లక్ష్యంగా పోరాడుతామని చెప్పారు.

Bhuma Nagi Reddy's Last Interview || About Loss of his Family Members || భుమానాగిరెడ్డి లాస్ట్ ఇంటర్వ్యూ , తన ఫ్యామిలీ ని ఎలా కోల్పోయాడో చెప్పిన వీడియో

తప్పని సరిగా చూడవలసిన వీడియో శ్రీ భూమ నాగిరెడ్డి , శ్రీమతి శోభ నాగిరెడ్డి ntv తో చనిపోకముందు చేసిన memorable interview


భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఈయన 1964 జనవరి 8 న జన్మించారు. ఈయన 1992 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణం చెందడంతో ఈయన ఈ స్థానానికి ఎంపికయ్యారు.

1996 లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నంద్యాల లోకసభ నియోజకవర్గంనకు ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఈయనను ఎంపిక చేయడంతో ఈయన వెలుగులోకి వచ్చారు. ఈయన లోక్‌సభ సభ్యునిగా మూడు సార్లు తన సేవలను అందించారు.2017 మర్చి 12 న గుండె పోటు తో మరణించారు.
శోభా నాగిరెడ్డి (నవంబరు 16 1968 – ఏప్రిల్ 24 2014) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం లో 2012లో ఆమె రాజీనామా చేసిన వరకు నాలుగు సార్లు శాసన సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రోడ్దు రవాణా సంస్థ లో చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఆమె అంతకు పూర్వం తెలుగు దేశంపార్టీ లో రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. 2012 లో ఆమె ప్రజారాజ్యం పార్టీని వీడి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె భర్త భూమా నాగిరెడ్డి కూడా ప్రముఖ రాజకీయనాయకులు. ఆయన రెండుసార్లు శాసనసభ్యునిగానూ, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగానూ పనిచేశారు. ఆమె కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసన సభ్యులు, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అయిన శోభా నాగిరెడ్డి చురుకైన నేత.


2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా 23న నంద్యాలలో షర్మిల పాటు శోభానాగిరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో షర్మిలకు వీడ్కోలు పలికి... శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు. దీబగుంట్ల సమీపంలోని జాతీయ రహదారిపై స్థానిక రైతులు వేసిన ఆరబోసిన ధాన్యపు కుప్పల్లోకి ఆమె ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లింది. ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శోభానాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. లో అక్కడ చికిత్స పొందుతూ 24వ తేది ఉదయం 11.05 గంటలకు మరణించారు.

YSR మీద అద్బుతమైన song పాడిన ఒక అభిమాని | పులివెందులలో పుట్టిన ఓ బిడ్డా

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భ‌యంతో టీడీపీ నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంది.

కడప స్తానిక సంస్తల mlc ఎన్నికల్లో గెలుపుదక్కదని తెలుసుకున్న tdp నేతలు ఇక అక్రమాల పర్వానికి తెరలేపుతున్నారు . ఏకంగా ఎన్నికల నిబందనల్లోనే లొసుగులు వున్నట్లు గా పెట్టుకొని లబ్ది పొందాలని చూస్తున్నారు . ఇప్పటికే తను కిడ్నాప్ చేసినవారు , ప్రలోభాలు పెట్టి తీసుకువెల్లినవారు ysr కాంగ్రెస్ పార్టీ కి  వోటు వేయకుండా చేసేందుకు బ్యాలెట్ గేమ్ ఆడుతున్నారు . ఎన్నికల నిభందన ప్రకారం వోతువేసే పద్దతి తెలిపేందుకు నిరక్షరాస్యులైన వారు తమ వెంట మరో వ్యక్తిని తీసుకు వెళ్ళే వీలుంది . అంతే కాదు అనారోగ్యంతో బాధ పడుతున్నవారు తమవెంట మరో వ్యక్తిని తీసుకువెళ్ళే రూల్ వుంది . ఈ నిభందనలను ఉపయోగించుకొని ఇప్పటికే తము కిడ్నాప్ చేసిన ysr కాంగ్రెస్ పార్టీ ఓటర్లను బ్లాక్మెయిల్ చేసేందుకు రంగం సిద్దం చేసారు .  

లోకేష్ మీద జగన్ అభిమాని ఎలా రెచ్చిపొయాడో చూడండి| Jagan Fan Fire on MLC Nara Lokesh

నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ mlc కి గాను ఆయన  ఆస్తులను మరల ఒకసారి ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే .. అంతకు ముందు ప్రకటించిన ఆస్తులు రేటు కి ఇప్పుడు ప్రకటించిన ఆస్తుల విలువకి ఎక్కడ కూడా పొంతన లేదు అని పాలు , పెరుగు అమ్ముకొని ఎలాగోలా బ్రతికేస్తున్నాము అని చెప్పిన లోకేష్ కి గట్టిగ కౌంటర్ ఇచ్చాడు ఒక jagan  అభిమాని , ఆయనలాగే ఒక చిన్న వ్యాపారం నేను కూడా పెట్టుకొని బ్రతికానని కానీ నా ఆస్తులు పెరగలేదు అని వాపోయాడు ఒక అభిమాని .
ఈ వీడియో చూసి లోకేష్ ఫై ఎలా విరుచుకు పడ్డాడో మిరే చూడండి.

వైయస్సార్ కుటుంబాన్ని విమర్శించిన వాళ్ళు ఏమయ్యారో ఒక్కసారి చూడండి ,BHUMA KUDA || jai jagananna


ఆటుపోట్లతో పార్టీ ని భుజస్కంధాలపై వేసుకొని ycp ని నడుపుతున్న నాయకుడు Y .S JAGANMOHANREDDY , ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు . అయితే జగన్ నోటివెంట పదే పదే పైన దేవుడు వున్నాడు , చూస్తున్నాడు , ప్రజలు చూస్తున్నారు  అంటుంటాడు . ఇంతకీ నిజంగా దేవుడు చూస్తున్నాడా ..

YCP ప్రస్తానం లో 5 ఏళ్ళు పూర్తి అయ్యాయి . తక్కువ సమయంలో ప్రత్యర్హుల తో ఎక్కువ తిట్లకు గురైన నాయకుడు ఎవరైన వున్నారంటే అది ఒక్క జగనే . పదవుల కోసమో , అధినాయకుల మెప్పుకోసమో జగన్ ను తిట్టని ప్రత్యర్థి లేరు . ఒకరు లక్ష కోట్లు దోచుకున్న దొంగ అంటే మరొకరు తండ్రి సవం దగ్గర అధికారం కోసం సంతకాలు పెట్టిన్చించారు అని నిందలు మీద నిందలు వేసారు ..అయితే

జగన్ ను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టె నాయకులంతా తాత్కాలికంగా పదవుల ద్వార లబ్ది పొందినా తరువాత అడ్ద్రస్స్ లేకుండా పోయారు , వాళ్ళు ఎవరో ఎలా దెబ్బ తిన్నారో ఈ వీడియో చుస్తే తెలుస్తుంది ,
EE VIDEO CHUSINA TARUVATHA
భూమా నాగిరెడ్డి కూడా YCP లో వుంటూ వాళ్ళ పార్టీ కే ఎసరుపెట్టాలని చూసాడు దిన్ని బట్టి చూస్తె దేవుడు నిజంగానే చూస్తున్నాడు అనిపిచాట్లేదా ...

మీరు చెప్పిన లక్షకోట్లు ఉంటె మీరే తీసుకోండి అసెంబ్లీ లో YS JAGAN CHANDRABABUNI ADIGINA TEERU CHUSTE

అసెంబ్లీ లో యస్ జగన్ గారు చంద్రబాబు నాయుడు కి ఏవిదంగా ప్రస్నిన్చారో తనపై పెట్టిన దొంగ కేసులు , సిబిఐ విచారణ గురించి , చంద్రబాబు నాయుడు కి సూటిగా అడిగిన తీరుచుస్తే ys జగన్ అంటే ఏమిటో ఈ వొక్క వీడియో చుస్తే తెలిసిపోతుంది , కొసమెరుపుగా నా దగ్గర లక్ష కోట్లు వున్నై అని నిరూపణ చేస్తే అవి మీకే ఇచ్చెస్తాను , మేరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను అని చెప్పారు ..

చంద్రబాబుని, లోకేష్‌ని నేషనల్ లెవెల్లో ఆటాడుకున్న హీరోయిన్.|| jai jagananna


AP CM చంద్రబాబు తనయుడు నారా లోకేష్  MLC ఎన్నికల సందర్బంగా ప్రకటించిన ఆస్తుల వివరాలు నేషనల్ లెవల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి , సిని హీరొయిన్ నగ్మ ఎలా కౌంటర్ ఇచ్చిందో ఈ వీడియో చుస్తే తెలుస్తుంది .



పువ్వును చూసినా తట్టుకోలేకపోతున్నారు- రోజా కామెంట్స్. roja hot comments on tdp || JAI JAGANANNA

YCP MLA ROJA TDP PY KONNI AASAKTHIKARA VAKYALU CHESARU .OKA INTERVIEW LO MATLADAUTHU AAME TANAPERUCHEBITHE VIPAREETHAMYNA PRASTATION VASTUNDHANI CHIVARIKI ROJA PUVVUNU CHUSINA SARE THATTUKOLEKAPOTUNNARANI OKA INTERVIEWLO CHEPPARU

AP Assembly : YS Jagan speaks on Money Spent for BC Welfare - 7th May 17 || jai jagananna















AP Assembly : YS Jagan speaks on Money Spent for BC Welfare - 7th May 17
ap assembly lo ys jagan garu bc welfare  gurinchi ketainchina money gurinchi adiginandhuku speaker
ela avoid chestunnaro jagan gari matalanu ee video chuste artham avutundhi ..