భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక
రాజకీయ నాయకుడు. ఈయన 1964 జనవరి 8 న జన్మించారు. ఈయన 1992 లో ఆంధ్రప్రదేశ్
శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ
నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణం
చెందడంతో ఈయన ఈ స్థానానికి ఎంపికయ్యారు.
1996 లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నంద్యాల
లోకసభ నియోజకవర్గంనకు ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం
పార్టీ ఈయనను ఎంపిక చేయడంతో ఈయన వెలుగులోకి వచ్చారు. ఈయన లోక్‌సభ సభ్యునిగా మూడు
సార్లు తన సేవలను అందించారు.2017 మర్చి 12 న గుండె పోటు తో మరణించారు.
శోభా
నాగిరెడ్డి (నవంబరు 16
1968 – ఏప్రిల్
24 2014) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన
ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం లో 2012లో ఆమె రాజీనామా చేసిన వరకు నాలుగు
సార్లు శాసన సభ్యురాలిగా ఉన్నారు. ఆమె
ఆంధ్రప్రదేశ్ రోడ్దు రవాణా సంస్థ లో చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ప్రజారాజ్యం
పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఆమె అంతకు పూర్వం తెలుగు దేశంపార్టీ లో
రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేశారు. 2012 లో
ఆమె ప్రజారాజ్యం పార్టీని వీడి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె
భర్త భూమా నాగిరెడ్డి కూడా ప్రముఖ రాజకీయనాయకులు. ఆయన రెండుసార్లు శాసనసభ్యునిగానూ, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగానూ
పనిచేశారు. ఆమె కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసన సభ్యులు, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ
సభ్యురాలు అయిన శోభా నాగిరెడ్డి చురుకైన నేత.
2014
ఎన్నికల ప్రచారంలో భాగంగా 23న నంద్యాలలో షర్మిల పాటు శోభానాగిరెడ్డి కూడా
ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి నంద్యాల
అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో
షర్మిలకు వీడ్కోలు పలికి... శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు. దీబగుంట్ల
సమీపంలోని జాతీయ రహదారిపై స్థానిక రైతులు వేసిన ఆరబోసిన ధాన్యపు కుప్పల్లోకి ఆమె
ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లింది. ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ
ప్రమాదంలో శోభానాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను అర్ధరాత్రి దాటాక ఒంటి గంట
సమయంలో నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. లో అక్కడ చికిత్స పొందుతూ
24వ తేది ఉదయం 11.05 గంటలకు మరణించారు.
0 comments: