వెలగపూడి: అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై అబద్ధాలు చెబుతున్నారని వైయస్‌ఆర్ సీపీ
ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక
ప్యాకేజీ ఉందని అసెంబ్లీలో తీర్మాణించడం ఐదు కోట్ల ఆంధ్రప్రజలను మోసగించినట్లేనని
మండిపడ్డారు. తిరుపతి ఎన్నికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీని
పక్కనబెట్టుకొని 15 సంవత్సరాలు కావాలని మాట్లాడింది
గుర్తుకు లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. 14వ ఆర్థిక సంఘం అభ్యంతరాలు చెప్పిందనడం
దారుణమన్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులు లిఖిత పూర్వకంగా
హోదాకు మేము అడ్డుకాదని చెబుతున్నారని పేర్కొన్నారు. పోలవరం బహుళార్ధక
ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్ నట్టేట ముంచుతోందని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షనేత వైయస్ జగన్ పోలవరం, ప్రత్యేక
హోదాలపై వాస్తవాలు చెబుతుంటే అది జీర్ణించుకోలేని అధికార పక్షం ఆయనపై విమర్శలకు
దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి ఉన్న ప్రోటోకాల్‌ను కూడా
అధికార పార్టీ నేతలు తుంగలో తొక్కుతున్నారని ఫైరయ్యారు. రాష్ట్ర సమస్యలపై
వాస్తవాలు మాట్లాడుతున్న వైయస్ జగన్ మైక్ కట్ చేయడం అప్రజాస్వామికం అన్నారు.
స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టిన చంద్రబాబు
ప్యాకేజీ గొప్పదంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికార తెలుగుదేశం
పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రత్యేక హోదా పోరు ఆగదని స్పష్టం చేశారు. హోదా సాధనే
లక్ష్యంగా పోరాడుతామని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments: