మరోసారి అభాసుపాలైన పవన్ కళ్యాణ్
ఎదగడానికి తానేమీ ముఖ్యమంత్రి
కొడుకుని కాదంటూ జగన్ ని చులకన చేయాలన్న
కుతూహలంతో తన కన్న తండ్రినే చులకన చేస్తూ తన
అగ్నానాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్.
ఒక్క జగన్ మోహన్ రెడ్డి తప్ప
మిగతా ముఖ్యమంత్రుల కొడుకుల అడ్రెస్ ఏంటో నీకు తెలీదా పవన్? మరి వారెందుకు ఎదగలేదు? అంతేందుకు NTR కొడుకు హరిక్రిష్ణ
అన్న తెదెపా పెట్టాడే మరి నీకు తెలీదా? ఇప్పుడు హరిక్రిష్ణ ఎక్కడ? నీసిద్దాంతం ప్రకారం ఆయన ఎదగాలి కదా?
జగన్ ఎటువంటి పరిస్తితుల్లో
బయటికొచ్చాడో, ఎలాంటి ఇబ్బందులకు
గురయ్యాడో, ఎటువంటి లీగల్ ఇష్యూస్
ని ఫేస్ చేస్తున్నాడో, నిత్యం ఒక వర్గం మీడియాకు
ఎలా టార్గెట్ అవుతున్నాడో పవన్ కి తెలీనిది కాదు. అయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ
ఈ ఏడు సం.ల్లో స్టెప్ బై స్టెప్ తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడు.
పార్టీ పెట్టిన రెండు నెలలకే
పోటీ చేశాడు.
మొదటి సం. ఒక MLA, ఒక MP తో మొదలు పెట్టాడు.
రెండవ సం. 2 M.P లు, 18 MLA లు గెలుచుకున్నాడు.
మూడవ సం. 3 MLC సీట్లు గెలుచుకున్నాడు.
నాల్గవ సం. 67 MLA లు, 9 MP లు గెలుచుకున్నాడు.
ఐదవ సం. అట్టహాసంగా రాజ్యసభకి
అడుగు పెట్టాడు.
ఆరవ సం. 2 నుంచి 8 MLC లకి చేరుకున్నాడు.
ఏడవ సం. మరో రాజ్యసభ సీటుని
కన్ ఫర్మ్ చేసుకున్నాడు. నేటికి దాదాపు కోటి యాభై లక్షలకు పైగా ఓటర్లను సంపాదించుకున్నాడు.
డిల్లీ నుంచి గల్లీ వరకూ అన్నీ
చట్ట సభల్లో తన ప్రజా ప్రతినిధులను గెలిపించుకోగలిగాడు. ఇది రాత్రికి రాత్రి వచ్చిన
బలం కాదు. దీనివెనక ఏడేళ్ళ శ్రమ దాగుంది.
మరి నువ్వేం చేశావు పవన్?
పార్టీ పెట్టి నాలుగేళ్ళయ్యింది.
నేటికీ కార్య వర్గం లేదు. పొలిట్ బ్యూరో లేదు, అధికార ప్రతినిధులు లేరు. ఉపాధ్యక్షులు లేరు. జిల్లా స్తాయి, మండల స్తాయి, గ్రామ స్తాయి కార్యదర్శులు
లేరు. నియోజవర్గ ఇన్ చార్జ్ లు లేరు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో తెలీదు. ఎక్కడెక్కడ
పోటీ చేస్తారో తెలీదు. ఎవరెవరికి టికెట్లిస్తారో తెలీదు. ఏది జరగాలన్నా మరో పార్టీ
మోచేతి కింద బ్రతకాల్సిందే!!
చివరికి ప్రెస్ మీట్ ఎప్పుడు
పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, దానికి స్క్రిప్ట్
ఎక్కడ నుంచి రావాలి, అందులో కంటెంట్ ఏముండాలో
కూడా ఒకరి దయాదాక్ష్ణ్యాల మీద ఆధారపడాల్సిందే!!
అలాంటి నువ్వు ఎదుగుదల గురించి
మాట్లాడడమా? ఎంతటి హాస్యాస్పదం
పవన్ గారు?
0 comments: