PAWAN KALYAN ONCE AGAIN DRAMA WITH NARA CHANMDRABABU NAIDU
PAWAN KALYAN ONCE AGAIN DRAMA WITH NARA CHANMDRABABU NAIDU
వారం రోజుల క్రితం ప్రెస్
మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నన్ను వాడుకొని వదిలేశారని భావిస్తున్నాను అని చెప్పాడు
కానీ నిన్నటి రోజున గుంటూరు లో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన తీరును
చూస్తే పవన్ ని ఇంకా వాడుతున్నట్టే సందేహించవలసి వస్తుంది. ఎందుకంటే అసలు ప్రశ్నించడానికే
పార్టీ పెట్టాను అని ఎప్పుడూ చెప్పే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అవినీతిని గత నాలుగు సంవత్సరాల
కాలంలో ఎప్పుడూ ప్రశ్నించకుండా చివరి ఎన్నికల సంవత్సరంలో ఇప్పుడు ప్రశ్నించడమంటే ఇది
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి
బ్రహ్మాండంగా రక్తి కట్టిస్తూ ఆడుతున్న మరో నాటకంగా చక్కగా అర్ధం అవ్వుతుంది. గత డిసెంబర్లో
పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా మరియు పోలవరం పర్యటన చేసినప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను
ప్రశ్నించకపోగా అక్కడి టీడీపీ ఎమ్మెల్యే ల ఇండ్లలో మరియు నాయకుల ఇళ్లలో వ్యక్తిగత ఫలహారాలు, విందులు, విశ్రాంతులు తీసుకున్నాడు.
మరి మూడు నెలల కిందట కూడా కనబడని ప్రభుత్వ అవినీతి ఇప్పుడే కొత్తగా జరుగుతున్నట్టు
చెప్పుతున్నాడు. ఇలా చెప్పి ఎవ్వరి చెవ్విలో పువ్వులు పెట్టాలని చూస్తున్నట్టో. కేంద్ర
ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్రత్యేక హోదాని కాకుండా ప్యాకేజీని ఇచ్చినప్పుడు
చంద్రబాబు , పవన్ లు ఇద్దరూ గతంలో
ఆహ్వానించారు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చూసిన ఇద్దరూ ఒకేసారి యూటర్న్
తీసుకొని రాష్ట్రానికి హోదానే కావాలని నాటకాలు ఆడుతున్నారు. అక్కడి నుండి మొదలయిన వీరి
నాటక ప్రదర్శన ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అవినీతి అంటూ ఇప్పుడు
కొత్తగా ఉపన్యాసం ఇస్తున్నాడు. ప్రభుత్వ అవినీతి ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు గత
నాలుగు సంవత్సరకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి దేశం మొత్తం విదితమే.
రాష్ట్ర ప్రభుత్వం ఈ అవినీతి లెక్కలు చూపించని కారణంగానే కేంద్రప్రభుత్వం కొన్ని శాఖలకు
నిధులు కూడా కేటాయించలేదు అనేది బహిరంగ రహస్యమే. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి మరియు రాజధాని
భూముల విషయం లో జరిగిన అవినీతిని మాజీ ప్రభుత్వ ప్రాధాన కార్యదర్శి IYR కృష్ణారావు గారు మీడియా
ముఖంగా వివరించారు. రాజధాని డిజైన్ల విషయంలో జరిగిన ప్రభుత్వ అవినీతిని జపాన్ కి చెందిన
“మాకీ” సంస్థ గతంలోనే పేర్కొని తన విధుల నుండి తప్పుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు
ప్రభుత్వ అవినీతికి 2014 తరువాత అంతేలేకుండా
ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవినీతి జగమెరిగిన సత్యం. పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో
ప్రభుత్వ అవినీతిని విమర్శిస్తూ చంద్రబాబు ను వ్యక్తిగతంగా విమర్శించకుండా జాగ్రత్తపడినట్టు
మనం గమనించొచ్చు. రాష్ట్రం లో జరిగిన “ఓటు కి నోట్” కేసు విషయంలో చంద్రబాబు పాత్ర ఏమిటో
దేశం మొత్తం చూసింది కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా దానిని విమర్శించిన పాపాన పోలేదు.
ఓటు కి నోట్ ని విమర్శించాల్సి వస్తే ముందుగా విమర్శించాల్సింది చంద్రబాబునాయిడు నే
అందుకే దాని జోలికి ఎప్పుడూ పోవడానికి సాహసించలేదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ MRO వనజాక్షి గారి మీద దాడి చేసి మూడు సంవత్సరాలు అయ్యింది దాని
గురించి గతంలో ఎప్పుడూ మాట్లాడని పవన్ కి ఇప్పుడే నిన్ననే సంఘటన జరిగినట్టు గుర్తుకు
వచ్చింది ఎందుకో? రాజధాని ప్రాంతం లో
ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమ చేస్తున్న దారుణాలు మరియు మంత్రి నారాయణ
రాజధాని ప్రాంతంలో చేసిన భూదోపిడీ మాత్రం తనకు కనబడలేదు. వీరిని విమర్శిస్తే కాపు సామాజిక
వర్గం దూరం అవ్వుద్ది. కాపు సామాజిక వర్గం ఓట్లు చీలకూడదు. కమ్మ సామాజిక వర్గం నేతలని
ఎన్ని తిట్టినా కూడా ఆ వర్గం ఓట్లు టీడీపీ కె వేస్తారు కానీ వేరే పార్టీలకి వెయ్యరు.
కాపులకి రిజర్వేషణ్ ఇస్తే బీసీలు ఇబ్బంది పడతారని పవన్ కళ్యాణ్ కి ఎలక్షన్స్ అయిన 4 సంత్సరాలకీ తెలిసింది.
ఇన్ని రొజులు కాపులు బీసీలు పడే బాధ కనిపించలేదా. నువ్వు పక్కన వున్నప్పుడు కాదా చంద్రబాబు
హామీ ఇచ్చింది. తెలంగాణలో వేరే పార్టీ కి చెందిన వారిని తెరాస లో చేర్చుకొని మంత్రి
పదవులిస్తే విమర్శించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చే సరికి YSRCP కి చెందిన ఎమ్మెల్యే
లని టీడీపీ లో చేర్చుకొని మంత్రి పదవులిస్తే ఇప్పటి వరకు విమర్శించిన పాపాన పోలేదు.
ఇక్కడ విమర్శించాల్సి వస్తే చంద్రబాబు నాయుడు నే విమర్శించాల్సి ఉంటుంది. రాష్ట్రం
లో ఇసుక మాఫియా ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కాదు కానీ గతంలో దీని గురించి మాట్లాడని
పవన్ కి ఇప్పుడే గుర్తుకువచ్చింది ఎందుకో? పెద్ద నోట్లు రద్దు జరిగి ఒక సంవత్సరం పైగా అయ్యింది మరి ఆ సమయంలో
దొరికిన శేఖర్ రెడ్డి గురించి గతంలో ఎప్పుడూ మాట్లాడని పవన్ కి ఇప్పుడే గుర్తుకువచ్చింది
ఎందుకో? ఆక్వా ఫుడ్ కి వ్యతిరేఖంగా
ఒక ప్రాంతం మొత్తం గళమెత్తితే రాష్ట్రం మొత్తం సంచలనం అయ్యింది మరి అక్కడి బాధితులకి
అండగా అప్పుడు మాట్లాడని పవన్ కి ఇప్పుడే గుర్తుకువచ్చింది ఎందుకో? ఇలా మొదలు ప్రతి సంఘటనలు
జరిగినప్పుడు మాట్లాడకుండా ఎప్పుడో ఒకసారి మీకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రభుత్వాన్ని
ప్రశ్నించడమేమిటి? పోనీ ఈ విషయాలు, సంఘటనలు పవన్ దృష్టికి
రాకుండా ఉండవు ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ మరియు పార్టీ అధ్యక్షుడు
జగన్ ప్రతి సంఘటన మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాడు. చంద్రబాబు
ఇంత అవినీతి చేస్తున్నట్లు తెలిసి కూడా ఈ నాలుగేళ్లు ఏ ముఖం పెట్టుకొని అన్ని సార్లు
చంద్రబాబు ని కలిసావు. చివరికి 2017 లో ఒకసారి కలిసినప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వ పనితీరు బాగుంది
ఇంకో పదేళ్లు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి గా ఉండాలని కోరుకుంటున్నాను అన్నది మర్చిపోయావా? రాష్ట్రం మొత్తం హెచ్చు
మీరిన ప్రభుత్వ అవినీతి గురించి ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ప్రజలు పవన్ కళ్యాణ్ ని
చంద్రబాబు పార్ట్నర్ గానే గుర్తిస్తే రేపు సాధారణ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు
మొత్తం జగన్ కె వేస్తారు. కానీ జగన్ ని ముఖ్యమంత్రిగా చూడడం అనేది వీరిద్దరికి రుచించదు
కావున పవన్ నేతృత్వం లోని జనసేన పార్టీ ఎన్నికలలో గెలవకపోయినా పర్వాలేదు కానీ జగన్
మాత్రం ముఖ్యమంత్రి కాకూడదని వీరిద్దరి వ్యూహం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ
అవినీతి అంటూ ఇప్పుడు కొత్తగా దంచుడు ఉపన్యాసం ఇస్తున్నాడు. ఇలా ఇద్దరూ కలిసి నాటకాలు
ఆడడానికి ముఖ్య కారణం 2019
లో మరోసారి ప్రభుత్వ
వ్యతిరేక ఓట్లు మొత్తం ప్రతిపక్ష YSRCP కి పోకుండా చీల్చి తద్వారా కొంత ఓటింగ్ శాతాన్ని
పవన్ నేతృత్వం లోని జనసేన కి మరల్చి 2019 లో మరోసారి టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం. అందుకు
గొప్ప ఉదాహరణ గా 2009 అప్పటి ఎన్నికలు.
అప్పటి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక
ఓట్లని టీడీపీ తో పంచుకొని 18 స్థానాలలో గెలుపొందింది. అలా ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక
ఓట్లని పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ , YSRCP తో పంచుకొని మరలా టీడీపీ నే అధికారం చేపట్టాలని
వీరి వ్యూహం. కానీ 2009 కి 2019 కి మధ్య చాలా వ్యత్యాసం
ఉంది. ముఖ్యంగా 2009 లో YSR నేతృత్వం లోని కాంగ్రెస్
ప్రభుత్వ వ్యతిరేకత చాలా తక్కువ. 2004 లో YSR
ముఖ్యమంత్రి అయినా
తరువాత ప్రవేశపెట్టిన ఉచిత పథకాలతో అయన ప్రజల మనస్సులో ఒక దేవుడిగా చీర స్థాయిగా నిలిచారు
దానితో పోలిస్తే అప్పటి ప్రభుత్వ అవినీతి పెద్దగా కనబడకుండా పోయింది. ఆ ఉన్న తక్కువ
వ్యతిరేక ఓట్లతో పాటు తన అభిమానులు మరియు మార్పు కోరుకొనే వారి కొందరి ఓట్లతో కలుపుకొని
అప్పటి ప్రజారాజ్యం అతి మెజారిటీ లతో 18 స్థానాలలో గెలవగల్గింది. కానీ ఇప్పుడు అలా పునరావృతం అయ్యే అవకాశాలు
చాలా తక్కువ. ఎందుకంటే 2014
లో ఎన్నో అమలుకాని
హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలలో ఒక్కటి కూడా అమలుచేసి
నిలబెట్టుకోలేక పోయేసరికి రాష్ట్ర ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత హెచ్చుమీరింది. అదే సమయం
లో అటు ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రభుత్వ అవినీతి మీద నిరంతరాయంగా పోరాటం చేస్తూ చాలా
వరకు సక్సెస్ అయ్యి ప్రజల మన్ననలు పొందాడు. ముఖ్యంగా అసెంబ్లీ లో జగన్ ప్రభుత్వాన్ని
లెక్కలతో కడిగేసిన తీరు ప్రజల మనసుల్ని హత్తుకుంది. అసెంబ్లీ లో ముఖ్యమంత్రి మరియు
మంత్రులు జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగినా ఎక్కడా సంయమనం కోల్పోకుండా జగన్ అసెంబ్లీ
లో ప్రవర్తించిన తీరు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యేక
హోదా పై జగన్ మొదటి నుండి నిలబడడం హోదా కోసం ఎందాకైనా పోరాటం చెయ్యడం రాష్ట్ర ప్రజలు
బాగా గుర్తించారు. ఆ రోజు ప్యాకేజీ నే ముద్దు అన్న నాయకులు ఈ రోజున హోదానే కావాలి అంటున్నారు
అంటే దానికి కారణం జగన్ మాత్రమే. హోదా ఉద్యమం అంటే కేసులు పెట్టి జైళ్లకు పంపుతాము
అని ప్రభుత్వం నిర్బంధించిన సమయంలో హోదా ఉద్యమం ను చావకుండా బ్రతికించిన నాయకుడు జగన్
మాత్రమే. ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిత్వం మీద రాష్ట్రం లోని చాలా వర్గాల ప్రజలు
జగన్ పై నమ్మకంతో అండగా నిలిచిన ఈ సమయంలో ప్రత్యామ్నాయంగా పవన్ ని చూసే అవకాశమే ఉండదు.
పైగా పవన్ ఇచ్చిన మాట మీద నిలబడకపోగా సందర్భానుసారం పూటకోసారి మాటలు మార్చే విధానం
చూస్తే పవన్ కున్న రాజకీయ పరిజ్ఞానం ఏపాటిదో అర్ధమవుతుంది. రేపు సాధారణ ఎన్నికలలో ఎవ్వరు
డబ్బులిచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం నాకే వేయండి అని పవన్ చెప్పడం రాజకీయ అజ్ఞానమే.
కానీ ఇప్పుడు నువ్వు కూడా ఎన్నికలు అయిన తరువాత నీ అన్న చిరంజీవిలా నీ పార్టీ ని మరియు
కార్యకర్తల్ని డబ్బులకి హోల్ సేల్ గా అమ్మి వేరే పార్టీ లో విలీనం చేయవని నమ్మకమూ లేదు.
పైగా ఈ మధ్య కొన్ని సినిమాల పరాజయంతో పవన్ కళ్యాణ్ కున్న గత ఇమేజ్ కూడా చాలా దెబ్బతినింది
మరియు పైపెచ్చు పవన్ కళ్యాణ్ పై వైవాహిక వ్యక్తిగత విమర్శలు కూడా చాలా ఎక్కువ. ఇటువంటి
విమర్శలు అన్నీ ప్రస్తుత రాజకీయాలలో చాలా ప్రభావం చూపుతాయి. ఇలా రాష్ట్రంలోని ఏ సమస్య
మీదా అవగాహన లేని మాట మీద నిలబడే వ్యక్తిత్వం లేని పవన్ ని ఒక రాజకీయ నాయకుడుగా ప్రజలు
గుర్తించడమే కష్టం మరి అటువంటివాడు జగన్ కు ప్రత్యామ్నాయం గా గుర్తించడమంటే అంతకన్నా
హాస్యాస్పదం అయిన విషయం ఉండదేమో? కావున ఈ సమయం లో రాష్ట్ర ప్రజలు టీడీపీ కి సరైన ప్రత్యామ్నాయం
గా YSRCP మరియు ఎటువంటి క్లిష్ట
పరిస్థితుల్లో అయినా తమకు అండగా నిలిచే నాయకుడుగా జగన్ నే చూసుకుంటున్నారు కావున 2009 లో ప్రభుత్వ వ్యతిరేకతతో
ప్రభుత్వం నిలబెట్టుకున్నట్లు 2019 లో కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో నిలబెట్టుకోవడమనేది అసాధ్యం.
Pawan Kalyan is once again unfortunate infront of media
మరోసారి అభాసుపాలైన పవన్ కళ్యాణ్
ఎదగడానికి తానేమీ ముఖ్యమంత్రి
కొడుకుని కాదంటూ జగన్ ని చులకన చేయాలన్న
కుతూహలంతో తన కన్న తండ్రినే చులకన చేస్తూ తన
అగ్నానాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్.
ఒక్క జగన్ మోహన్ రెడ్డి తప్ప
మిగతా ముఖ్యమంత్రుల కొడుకుల అడ్రెస్ ఏంటో నీకు తెలీదా పవన్? మరి వారెందుకు ఎదగలేదు? అంతేందుకు NTR కొడుకు హరిక్రిష్ణ
అన్న తెదెపా పెట్టాడే మరి నీకు తెలీదా? ఇప్పుడు హరిక్రిష్ణ ఎక్కడ? నీసిద్దాంతం ప్రకారం ఆయన ఎదగాలి కదా?
జగన్ ఎటువంటి పరిస్తితుల్లో
బయటికొచ్చాడో, ఎలాంటి ఇబ్బందులకు
గురయ్యాడో, ఎటువంటి లీగల్ ఇష్యూస్
ని ఫేస్ చేస్తున్నాడో, నిత్యం ఒక వర్గం మీడియాకు
ఎలా టార్గెట్ అవుతున్నాడో పవన్ కి తెలీనిది కాదు. అయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ
ఈ ఏడు సం.ల్లో స్టెప్ బై స్టెప్ తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడు.
పార్టీ పెట్టిన రెండు నెలలకే
పోటీ చేశాడు.
మొదటి సం. ఒక MLA, ఒక MP తో మొదలు పెట్టాడు.
రెండవ సం. 2 M.P లు, 18 MLA లు గెలుచుకున్నాడు.
మూడవ సం. 3 MLC సీట్లు గెలుచుకున్నాడు.
నాల్గవ సం. 67 MLA లు, 9 MP లు గెలుచుకున్నాడు.
ఐదవ సం. అట్టహాసంగా రాజ్యసభకి
అడుగు పెట్టాడు.
ఆరవ సం. 2 నుంచి 8 MLC లకి చేరుకున్నాడు.
ఏడవ సం. మరో రాజ్యసభ సీటుని
కన్ ఫర్మ్ చేసుకున్నాడు. నేటికి దాదాపు కోటి యాభై లక్షలకు పైగా ఓటర్లను సంపాదించుకున్నాడు.
డిల్లీ నుంచి గల్లీ వరకూ అన్నీ
చట్ట సభల్లో తన ప్రజా ప్రతినిధులను గెలిపించుకోగలిగాడు. ఇది రాత్రికి రాత్రి వచ్చిన
బలం కాదు. దీనివెనక ఏడేళ్ళ శ్రమ దాగుంది.
మరి నువ్వేం చేశావు పవన్?
పార్టీ పెట్టి నాలుగేళ్ళయ్యింది.
నేటికీ కార్య వర్గం లేదు. పొలిట్ బ్యూరో లేదు, అధికార ప్రతినిధులు లేరు. ఉపాధ్యక్షులు లేరు. జిల్లా స్తాయి, మండల స్తాయి, గ్రామ స్తాయి కార్యదర్శులు
లేరు. నియోజవర్గ ఇన్ చార్జ్ లు లేరు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో తెలీదు. ఎక్కడెక్కడ
పోటీ చేస్తారో తెలీదు. ఎవరెవరికి టికెట్లిస్తారో తెలీదు. ఏది జరగాలన్నా మరో పార్టీ
మోచేతి కింద బ్రతకాల్సిందే!!
చివరికి ప్రెస్ మీట్ ఎప్పుడు
పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, దానికి స్క్రిప్ట్
ఎక్కడ నుంచి రావాలి, అందులో కంటెంట్ ఏముండాలో
కూడా ఒకరి దయాదాక్ష్ణ్యాల మీద ఆధారపడాల్సిందే!!
అలాంటి నువ్వు ఎదుగుదల గురించి
మాట్లాడడమా? ఎంతటి హాస్యాస్పదం
పవన్ గారు?
seniour charted accountant conformed about chandrababu naidu's boguses and fake investments of ap funds
chandrababu history | how to cheated chandrababu of his mama nandhamuri taraka rama rao
ఇదీ చంద్రబాబు చరిత్ర !
మీకోసం మచ్చుకు కొన్ని విషయాలు చెబుతున్నా చదవండి యువకులారా
!
1978 లో చంద్రబాబు కాంగ్ర్రెస్
లో వైద్య,సాంకేతిక విద్యాశాఖ
మంత్రిగా పని చేస్తుండగా 1982 లో కొత్తగా NTR తెలుగుదేశం పార్టీని
స్దాపించినపుడు చంద్రబాబు NTR
ని ఉద్దేసించి చెప్పిన
మాటలు ఇవి !
కాంగ్రెస్ అదిష్టానం ఆదేసిస్తే నా మామగారైన NTR పైనే పోటీ చేస్తా
అని చంద్రబాబు చెప్పాడు !
1983 ఎన్నికల్లో చంద్రబాబు
చంద్రగిరినుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి మేరసాని వెంకట రామానాయుడు చేతిలో 17,000 ఓట్ల తేడాతో ఘోరంగా
ఓడిపోయారు !ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాదించి NTR ముఖ్యమంత్రి అయ్యారు,,,
ఓడిపోయిన చంద్రబాబు వారం తిరగకముందే NTR పంచన తెలుగుదేశం పార్టీలో
చేరడానికి ప్రయత్నిస్తే చాలామంది వ్యతిరేకించారు !
అప్పుడు చంద్రబాబు తాను పదవులకోసం TDP లో చేరడం లేదని,పార్టీకి సేవచేసే
ఉద్దేశం తోనే చేరుతున్నానని చెప్పారు !
అల్లుడుగదా అని జాలిపడి NTR తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు !
అప్పటినుండి చంద్రబాబు NTR కి గోతులు తవ్వడం మొదలెట్టి చివరికి 1995 లో వైశ్యరాయ్ వేదికగా
MLA లనందరినీ లోబరుచుకుని
NTR పై చెప్పులు కూడా
వేయించి ఆయన్ని గద్దె దించారు !
చేతులతో మొక్కి తుపాకీతో కాల్చి గాందీని పొట్టనపెట్టుకున్న గాడ్సే
కంటే నీచుడు చంద్రబాబు అని NTR గారే స్వయంగా చెప్పారు !
ఈ తతంగం లో ఈనాడు పత్రిక యజమాని రామోజీరావు గారి పాత్ర ఉందన్నది
ఈ రాష్ట్రం లో అందరికీ తెలిసిన విషయమే !
ఈ విదంగా NTR తీవ్రమైన మానసిక వేదనతో కుములిపోయి చివరికి ఐనవారందరూ తనవెంట
అండగా నిలబడలేదనీ కడుపున పుట్టిన బిడ్డలను సైతం చంద్రబాబు తన మాయలో పడేసుకున్నాడని
మనోవేదనతో మరణం చెందారు,,,
చంద్రబాబు నేపద్యం,గత చరిత్రని ఇప్పటి పత్రికలు,abn,etv,tv9,tv5,ntv,mahanews media మనకు చెప్పవు,,ఎందుకంటే ఆ పత్రికలన్నీ
చంద్రబాబుకి అనుకూలంగా ఉన్నవే కనుక,,,మరియూ అవన్నీ బాబు సామాజిక వర్గానికి చెందినవే కనుక !
అప్పుడు NTR ని అలా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు NTR విగ్రహాలకి దండలు
వెయ్యడం ఆత్మవంచన కాదా ?
కానీ ఈనాడు,ఆంద్రజ్యోతి,TV9 ఇవన్నీ ఎప్పుడూ మనల్ని ఒక పక్కే చూడమంటాయి ! రెండో పక్కనున్న
చంద్రబాబు వెన్నుపోటు చరిత్రనీ,అవకాశవాదాన్నీ మనకు చూపించవు !
జగన్, షర్మీలా కుమార్తెలు YS Jagan Daughters, Wife Bharati, Sharmila at YS Rajashekar Reddy Ghat
జగన్, షర్మీలా కుమార్తెలు YS Jagan Daughters, Wife Bharati, Sharmila at YS Rajashekar Reddy Ghat
jaganmohan Reddy was born December 21, 1972 in
Pulivendula village of Kadapa District, Andhra Pradesh. He received his early
education from Pulivendula and Hyderabad Public School. He founded the daily
Telugu language newspaper sakshi and the television channel Sakshi TV.He is the
chief promoter of Bharathi Cements.Jagan Reddy is a Christian, born to a
Christian family (Protestant).
·
YS. Raja Reddy, Dr. YSR, and his family including
Jagan are known for organizing charitable services to the under developed and
under privileged sections of the society irrespective of being in power or not.
All these charitable services are funded by YSR’s family.[4]
·
YSR family is providing free water supply in drought
areas where people lack drinking water supply
·
Vijetha physically handicapped children school - A
school for kids with special needs was started under the YSR foundation at
Pulivendula in YSR district.
·
Dr YSR’s father YS Raja Reddy started a polytechnic
college in the name of YSR’s guru Venkatappaiah garu
·
YSR family always helped the needy people. They
provided food for poor people during the drought stricken times in Pulivendula
constituency
·
Dr. YSR started his medical practice in Jammalamadugu
and he was popularly known as Rs. 1 doctor as he charged only a rupee for
consultation.
·
YSR family also runs an old age home for needy poor
people.
Subscribe to:
Posts (Atom)