చంద్రబాబుకి నంద్యాలలో మహిళలు దిమ్మతిరిగే షాక్ | AP CM Chandrababu Nandyala Tour



బాబు బాగోతం మాటలు వినండి..షేర్ చెయ్యండి.అందరికీ తెలియజేయండి.మీ బుల్లెట్


రఘువీరా రెడ్డి జగన్కు రాసిన లేఖలో ఏముంది

రఘువీరా రెడ్డి జగన్కు రాసిన లేఖలో ఏముంది




కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కి రాసిన బహిరంగ లేఖ ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు ఇవ్వడం జగన్ చేసిన అతిపెద్ద పొరపాటు అన్నారు రఘువీరా. వై ఎస్ సిద్దాంతాలు అన్నీ జగన్ తుంగలో తొక్కారు అని తాను ఎప్పుడో చెప్పాను అనీ ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని గుర్తు చేసారు రఘువీరా. వైకాపా ని లక్ష్యంగా చేసుకుని వారికి ఉన్న వై ఎస్ లెగసీ ని తమవైపు తిప్పుకోవడం ద్వారా ఏపీ లో మళ్ళీ నిలబడ్డం లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ.

ఈ వ్యూహంపై వైకాపా కూడా ధీటుగానే స్పందించ‌డం మొద‌లుపెట్టింది. ఈ రెండు పార్టీల మ‌ధ్య ఇప్పుడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డికి సంబంధించిన వాదోప‌వాదాలు ప్రారంభం అయ్యాయి! కాంగ్రెస్ అప్పట్లో అధికారం లో ఉంది కాబట్టే వై ఎస్సార్ కావాల్సినన్ని పథకాలు చేపట్టగాలిగారు అనీ కాంగ్రెస్ లాజిక్ లాగుతోంది. వై ఎస్ చేసిన ప్రతీ దాంట్లో కాంగ్రెస్ ఘనత దాగుంది అనీ ఆయన గొప్పతనం తమదే అని చాటుకునే ప్రయత్నం గట్టిగా కాంగ్రెస్ వాళ్ళు. తిరుగు సమాధానం చెప్పే పనిలో ఉన్న వైకాపా కూడా తక్కువగా ఏమీ మాట్లాడలేదు.

రాజశేఖర్ రెడ్డి ప్రాభవాన్ని జనాలలో గట్టిగా తుడిచిపెట్టె లక్ష్యం పెట్టుకున్న కాంగ్రెస్ ఆయనకి చేసిన అన్యాయాలు, ఆయ చనిపోయిన తరవాత ప్రవర్తించిన తీరు అన్నీ పక్కకి పెట్టి వైకాపా మీద పడడాన్ని వాళ్ళు సీరియస్ అవుతున్నారు. వై ఎస్ మరణం తరవాత కాంగ్రెస్ జగన్ కి ఆయన కుటుంబానికీ ఏం చేసిందో చూపించే ప్రయత్నం చేస్తోంది వైకాపా. మొత్తం మీద వై ఎస్ లెగసీ , గొప్పతనం మాదంటే మాది అంటూ కొట్టుకుంటున్నారు రెండు పార్టీల వారు .