Latest Bangla Movies

Latest Movie Trailers

Undavalli Arun Kumar Slams Chandrababu | ‘మందుబాబులు స్ట్రైక్‌ చేస్తే ప్రభుత్వాలు అల్లాడుతాయి’..

Undavalli Arun Kumar Slams Chandrababu | ‘మందుబాబులు స్ట్రైక్‌ చేస్తే ప్రభుత్వాలు అల్లాడుతాయి’..

Undavalli Arun Kumar Slams Chandrababu

మందుబాబులు ఓ వారం రోజులు స్ట్రైక్‌ చేస్తే ప్రభుత్వాలు అల్లాడిపోతాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.8.50కి తయారయ్యే మద్యంను రూ.50కి అమ్ముతున్నారని, దీంట్లో 37 రూపాయలు ప్రభుత్వం దోచేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై చాలా మంది తనను సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు. అమరావతి బాండ్లు, వడ్డీరేట్లపై చర్చ జరుగుతోందని, ట్యాక్స్‌ ఎంతో తెలియకుండా బాండ్లు ఎలా ఇష్యు చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. కండిషన్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. పేద, ధనికుల మధ్య అంతరాన్ని తొలగించాలని, పేదల ఆర్థిక స్థితులను మార్చాలని సూచించారు. 

దేశంలో ఎక్కడాలేని వడ్డీలు ప్రభుత్వం వసూలు చేస్తోందన్నారు. జలయజ్ఞంలో ఇచ్చిన కేటాయింపులు ఏంటని ప్రశ్నించారు. నాలుగేళ్లలో లక్షా 30 వేల కోట్లు అప్పు చేశారని, ఇంత అప్పు చేసి దేనికి ఖర్చు చేశారో సమాధానం చెప్పాలన్నారు. వ్యాపారం, రాష్ట్రం ఒకే మాదిరిగా ఉండకూడదని పాస్కల్‌ చెప్పారని, ప్రభుత్వం మాత్రం వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నిజం చెప్పి పాలన చేయగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న వ్యాపారాన్ని స్విట్జర్లాండ్‌ ఆర్థికవేత్త వ్యతిరేకించారని తెలిపారు. వారానికోసారి ఖర్చు పెట్టిన లెక్కలు ప్రజలకు చెప్పగలరా అని, కనీసం ఈ 9 నెలల ఖర్చైనా చెప్పాలన్నారు. అవినీతి చేసి డబ్బులివ్వాల్సి వస్తోందని బాబు చెప్పారని, నంద్యాల ఎన్నికల్లో ఒప్పుకున్నారని ఉండవల్లి పేర్కొన్నారు.

--

Undavalli Arun Kumar Slams Chandrababu